shocking elements in Shamshabad apsara murder case. శంషాబాద్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. భక్తురాలిగా వచ్చే అప్సరతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి వెంకటసాయి కృష్ణ ఆమెను హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. కేసు దర్యాప్తులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయంలో వెంకటసాయి కృష్ణ పూజారిగా చేస్తున్నారు. ఆ గుడికి అప్సర తరచూ వస్తూండేది.