minister ktr distributed podu land pattas in sircilla. ఆదివాసీల చిరకాల కోరికను నెరవేర్చింది కేసీఆర్ సర్కారేనని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రూ. 73వేల కోట్లను రైతుల ఖాతాల్లో సీఎం కేసీఆర్ వేశారని.. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నామన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు.