Helicopter With 6 People Onboard Crashes In Nepal, Bodies Recovered. నేపాల్‌లో గల్లంతైన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ఉదంతం విషాదాంతమైంది. గల్లంతైన ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఐదుగురు మెక్సికన్‌లతో సహా మొత్తం ఆరుగురు ఉన్నారని చెప్పారు. వీరంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. గాలింపు చేపట్టిన సహాయక బృందాలు పైలట్ తోపాటు ఐదుగురు మెక్సికన్ల మృతదేహాలను గుర్తించాయి.