No CoWin Data Breach, Explains What Really Happened: Centre. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన కోవిన్ పోర్టల్(Cowin portal)లోని సున్నితమైన సమాచారం లీకైందంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్యశాఖకు చెందిన కోవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమైనదని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని తెలిపింది. డేటా లీక్ అయ్యిందనే వార్తలను కొట్టిపారేసింది.