Telangana government announces 8 new medical colleges in the state. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది