popular Telugu cine director k vasu passes away. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కే వాసు కన్నుమూశారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు నెలలుగా ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు.