telangana high court directs tspsc to give hall ticket for 4 accused in paper leakage. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.