telangana minister Harish Rao gives good news to asha workers. రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. ఇతర మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతిలను మంత్రి ఆదేశించారు.