Weather alert: high temperatures in telangana, till May 29th. తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. ఉదయం 9 తర్వాత బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. మరోవైపు, సాయంత్రం 6 గంటల వరకు కూడా రాష్ట్రంలో వడగాలులు వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులు ఎండవేళల్లో బయటికి రావొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.