Rajasthan: Cash, Gold Worth Crores Found In Government Building's Basement. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ కార్యాయలంలో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో క్లెయిమ్ చేయని రూ. 2.31 కోట్ల నగదు, 1 కిలో బంగారు బిస్కెట్లను రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన ఈ ఘటనలో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.