Godavari river floods at bhadrachalam: second warning continues. భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి మళ్లీ పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు గోదావరి నీటి మట్టం 52.1 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.