Telangana government releases Rythu Bandhu funds. తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. రైతు బంధు పథకం కింద రాయితీ సాయం పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు రైతుబంధు నిధులు రూ. 642.52 కోట్లు జమ అయ్యాయి. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.