weather update: next 3 days heavy rains telangana state. రాజధాని నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. మూడు రోజులపాటు పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రస్తుతం ఆవర్తనం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని తెలిపింది.