Goshamahal MLA Raja Singh meets minister Harish Rao. తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భేటీ అయ్యారు. గత కొంత కాలం క్రితం భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజా సింగ్.. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజా సింగ్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది.