A stray dog attacked on a child in Santosh Nagar, Hyderabad. హైదరాబాద్ సంతోష్ నగర్ కాలనీలో ఇంటి ముందు నిలబడి ఉన్న ఐదేళ్ల బాలుడు అబ్దుల్ రఫీపై వీధి కుక్క విచక్షణా రహితంగా దాడి చేసింది. గమనించిన స్థానికులు కుక్కను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హుటాహుటిన బాలుడిని నారాయణగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.