moderate rainfall in Hyderabad: next three days normal rains telangana districts. హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ జోరువాన కురిసింది.