A 10th student burnt alive in Bapatla district. బాపట్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అమర్నాథ్ స్నేహితుడే నిందితుడు కావడం గమనార్హం. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత బాలుడి స్నేహితుడు వెంకటేశ్వర్ రెడ్డి మరికొందరితో కలిసి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలలం రేపింది.